A huge donation from an unknown devotee from Mysuru to Tirumala Shri Venkateswara.. He didn’t even mention his name, and as for how much he gave

- తిరుమల శ్రీవారికి మరోసారి భారీగా విరాళాలు
- మైసూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడి విరాళం
- రూ.1.10 కోట్ల విలువైన ఐదు బంగారు పతకాలు
తిరుమల శ్రీవారిని ప్రతిరోజూ దర్శించుకునే భక్తులు కానుకలు, విరాళాలు అందజేస్తుంటారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలు ఇస్తారు.. బంగారం, వెండి, వాహనాలు, విలువైన వస్తువుల్ని స్వామివారి పేరుతో అందిస్తుంటారు. ఇటీవలి కాలంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ట్రస్ట్‌లకు భక్తుల భారీగా విరాళాలు సమర్పిస్తున్నారు. అలాగే కొందరు భక్తులు స్వామివారికి భారీగా బంగారాన్ని, వెండిని అందజేస్తున్నారు. తాజాగా తిరుమల శ్రీవారికి భారీగా బంగారం, వెండి కానుకలుగా అందాయి.

