Grand NTR Jayanti celebrations

రాష్ట్రవార్త-తెనాలి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి భారీ కేక్ కత్తిరించి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న మహానాడు వేడుకల్లో గురువారం ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలపాటి తెలిపారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ రామారావు అని కొనియాడారు. కొలకలూరు, నందివెలుగు, సంఘం జాగర్లమూడి, అంగలకుదురు, సుల్తానాబాద్, వహాబ్ చౌక్, శివాజీ చౌక్, లింగారావు సెంటర్, పార్టీ ప్రధాన కార్యాలయాల్లో క్లస్టర్ల వారీగా నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమం టిడిపి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని ఆలపాటి అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల ముందు పారదర్శకంగా అందించటమే కాకుండా నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేయాలన్నదే మహానాడు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గత పాలకులు ఎదుర్కుంటున్న విమర్శలకు తావ్వికూడదని పార్టీ వర్గాలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు అప్పసాని రాజేష్, ఈదర వెంకట పూర్ణచంద్, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, గుమ్మడి రమేష్, పార్టీ కార్యకర్తలు పాల్గున్నారు.

