The Central Committee expressed satisfaction with the meaningful activities of the Municipal Corporation..


పురపాలకసంఘ అర్ధవంతమైన కార్యాచరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సెంట్రల్ కమిటీ

స్వశ్చభారత్ సెంట్రల్ కమీటీకి వ్యర్ధాలతొ అర్దవంతమైన ఆదాయ వనరు అంశాలను వివరిస్తున్న కమీషనర్ అప్పలనాయుడు

రాష్ట్రవార్త తెనాలి:
కేంద్రప్రభుత్వం పురపాలక సంఘాలకు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా విడుదల చేసే నిధుల వినియోగం పరిశీలన దిశగా, స్వశ్ఛభారత్ కేంద్ర బృందం మంగళవారం తెనాలి పురపాలక సంఘం పరిధిలో పర్యటించి, వ్యర్ధాలను అర్ధవంత ఆదాయ వనరుగా మారుస్తున్న తీరు పట్ల తగు సంతృప్తిని వ్యక్తం చేసింది.
స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురభి మాలిక్ , ఏడీబీ కన్సల్టెంట్ మనోజ్ మాథుర్, ఎన్‌పీఎంయూ ప్రతినిధి దీపక్ గోయల్లతో కూడిన కేంద్ర బృందం తెనాలి పురపాలక సంఘం పరిధిలో
బుర్రిపాలెం రోడ్డులోని ఆర్‌.ఆర్.ఆర్ కేంద్రం, కంపోస్ట్ యార్డు, పూలే కాలనీలోని మురుగునీటి శుద్ధి కేంద్రం , హోమ్ కంపోస్టింగ్ యూనిట్లు, ఆన్‌సైట్ కంపోస్టింగ్ కేంద్రాలు, టెర్రస్ గార్డెన్లను సందర్శించి పనితీరును పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పథకాల అమలు, 10 ఎంఎల్‌డీ ఎస్‌టీపీ, లెగసీ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించింది.
పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, పచ్చదనం పెంపు చర్యల పట్ల కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం 10 టన్నుల సామర్థ్యంతో ఉన్న కొబ్బరి బొండాల ప్రాసెసింగ్ ప్లాంట్‌ను 15–20 టన్నులకు పెంచడంతో పాటు, వర్మీ కంపోస్టు, హోమ్ కంపోస్టింగ్ సామర్థ్యాలను కూడా విస్తరించాలని సూచించింది. అలాగే 10 ఎంఎల్‌డీ సామర్థ్యంతో పనిచేస్తున్న ఎస్‌టీపీ ప్లాంట్ పనితీరును ప్రశంసిస్తూ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సామర్థ్యాన్ని మరింత పెంచాలని సూచించినట్లు పురపాలక సంఘం కమిషనర్ రామ అప్పలనాయుడు మీడియాకుతెలిపారు.
తెనాలి పురపాలక సంఘం చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, వ్యర్థాల నిర్వహణ విధానాల పట్ల కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు.
స్వశ్చభారత్ సెంట్రల్ కమీటీకి వ్యర్ధాలతొ అర్దవంతమైన ఆదాయ వనరు అంశాలను వివరిస్తున్న కమీషనర్ అప్పలనాయుడు

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 40

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *