Kathari Harish’s birthday celebrations held in a grand manner

Kathari Harish’s birthday celebrations held in a grand manner
ఘనంగా కఠారి హరీష్ జన్మదిన వేడుకలు....

రాష్ట్రవార్త-తెనాలి: గతంలో 11వ వార్డుగా, ప్రస్తుతం 14వ వార్డుగా ఉన్న ప్రాంతానికి తొలి కౌన్సిలర్‌గా ఎన్నికైన కఠారి హరీష్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 14వ వార్డులోని ఆయన నివాసం వద్ద వార్డు నాయకులు, ప్రజలు, అభిమానుల సమక్షంలో వేడుకలు నిర్వహించారు. తొలుత కటారి హరీష్‌ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు అన్నార్తులకు వితరణ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ శివలింగేశ్వరస్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు కుర్రా శ్రీను మాట్లాడుతూ కఠారి హరీష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టణ అభివృద్ధికి సేవలందించాలని కోరారు.
వార్డు నాయకులు షేక్ మౌలాలి మాట్లాడుతూ కౌన్సిలర్ హరీష్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని వార్డు ప్రాజలకు ఎల్లప్పుడూ చేదోడువాదోడుగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కుర్ర సుజాత, కందుకూరి నాగరాజు, సూరదావీదు, కటారి తేజ, ఎరుకలపూడి జయప్రద, శివయ్య, పోతులూరి అశోక్, చిన్ను, తిరుపతయ్యతో పాటు వార్డు నాయకులు, ప్రజలు, హరీష్ అభిమానులు పాల్గొన్నారు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 95

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *