Just avoid ‘those two’! – Check for 50% of cancers!

“ఆ రెండు” వదిలేస్తే చాలు! – 50శాతం క్యాన్సర్లకు చెక్!

క్యాన్సర్ ముప్పు కారకాల్లో పొగాకు, మద్యమే ప్రధానం – WHO అధ్యయనంలో వెల్లడి
Quitting tobacco and alcohol can eliminate half of cancers : ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను క్యాన్సర్ భయపెడుతూనే ఉంది. ఈ విషయంలో మనమేమీ చేయలేమనే భావిస్తుంటారు. కానీ, దీని బారినపడటాన్ని తగ్గించుకోవటానికి చాలా మార్గాలే ఉన్నాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పది క్యాన్సర్ కేసులలో నాలుగు వరకు నివారించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా, పొగాకు, మద్యానికి దూరంగా ఉంటే సుమారు 50 శాతం క్యాన్సర్లను నివారించుకోవచ్చట. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

క్యాన్సర్లకు ఆహార అలవాట్లు, జన్యు స్వభావం నుంచి పర్యావరణ కాలుష్యం వరకూ రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. మనం జన్యు స్వభావాన్ని మార్చలేం కానీ, జీవనశైలిని మార్చుకోవచ్చు. అలాగే, కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలతో చాలా వరకూ క్యాన్సర్ బారినపడకుండా చూసుకోవచ్చు. ఇదే విషయాన్ని తాజా అధ్యయనం మరోసారి నొక్కి చెప్పింది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 2022లో మొత్తం 1.87 కోట్ల కొత్త క్యాన్సర్లు నమోదు కాగా, 71 లక్షల మార్చుకోదగిన 30 కారకాలతో ముడిపడి ఉందని పేర్కొంది. నివారించుకోదగిన క్యాన్సర్లలో దాదాపు సగం జీర్ణాశయ, ఊపిరితిత్తి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లేనట. అయితే, మార్చుకోదగిన ముప్పు కారకాల్లో బీడీలు, చుట్టలు, సిగరెట్లు కాల్చటం, మద్యం తాగటం, శరీర ఎత్తు, బరువు నిష్పత్తి (BMI), తగినంత శారీరక శ్రమ లేకపోవడం, గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులు నమలటం, వక్కపొడి తినటం, మహిళలు తమ పిల్లలకు తగినన్ని రోజులు చనుబాలు పట్టకపోవటం, గాలి కాలుష్యం, యూవీ కిరణాల ప్రభావం, ఇన్​ఫెక్షన్ కారకాలు, పనిచేసే చోట్ల రసాయనాల ప్రభావం వంటివి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.


rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 40

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *