ప్రస్తుతం ఉన్న కాలంలో ఆరోగ్యంగా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక అనారోగ్య మాత్రం ఉంటుంది. అందులో అరికాళ్ళ మంటలు ఒకటి ఈ మంటలు తగ్గించుకోవడానికి ఎన్నో  ప్రయత్నాలు చేస్తుంటాం. ముఖ్యంగా ఈ సమస్య రావడానికి అరికాళ్ళ  నాడులు దెబ్బతినడంవల్ల ఈ సమస్య వస్తుంది. అంతేకాకుండా కొంతమందికి మానసికంగా  బాగా లేకపోయినా అరికాళ్ళ  మంటలు వస్తూ ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అరికాళ్ళలో  ఇన్ఫెక్షన్ వల్ల అరికాళ్ళు  మంటలు పడుతుంటాయి.

 శరీరంలో విటమిన్ బి 12 లోపం ఉన్నప్పుడు అరికాళ్ళలో  నాడులు  దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే విటమిన్ b12 ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది.  అలాగే అతిగా మద్యం తాగి వాళ్ళలో కూడా నాడులు దెబ్బతిని అరికాళ్ళు మంట పుడుతుంటాయి. ఇలా జరిగినప్పుడు నాడు లోని  ఒక చిన్న ముక్కను తీసుకొని పరీక్షలు చేయిస్తారు. చిన్న క్లినిక్ లకు  వెళ్లకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించడం మంచిది. వారిచ్చే సలహాలను పాటించడంవల్ల అరికాళ్ళ  మంటలు తగ్గించుకోవచ్చు.  అలాగే వాటికి తగిన ఆహారం తీసుకోవడం మంచిది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…Health

 అరికాళ్ళు  మంటలు పడుతున్నప్పుడు విటమిన్ బి12 లభించే ఆహారంలో తీసుకోవడం మంచిది . గుడ్లు, చేపలు, మాంసం వంటివి తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి సెలవుగా బయటపడవచ్చు.

 చాలామందిలో కారణం లేకుండానే అరికాళ్లు  మంటలు వస్తూ ఉంటాయి.  ఇలాంటి సమయంలో అరికాళ్ళ ను  జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ సమస్య వల్ల అరికాళ్ళలో  పుండ్లు తయారవుతాయి. ఇది చాలా నొప్పి గా ఉంటాయి. అందుకే రాకుండా ఉండడానికి విటమిన్ బీ 12 ఉండే ఆహారాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 ఒక్కసారి అరి  కాళ్లు మంట రావడానికి వెన్నుపాము జబ్బులు, రక్త ప్రసరణ లో ఇబ్బందులు లాంటివి కూడా అరికాలు మంట పుట్టడానికి కారణమవుతాయి. ఇలాంటి సమస్య ఏర్పడగానే ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించి వారిచ్చే మందులు, సలహాలను పాటించడం వల్ల అరికాళ్ళ మంటలు తగ్గించుకోవచ్చు…

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 40

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *