Trump’s sensational statement on Hormuz… New ultimatum for Iran if talks fail!
హార్మూజ్‌పై ట్రంప్ సంచలన ప్రకటన.. చర్చలు విఫలమైతే ఇరాన్‌కు కొత్త అల్టిమేటం!

అమెరికా – ఇరాన్ మధ్య చర్చలు మళ్లీ బెడిసికొట్టేలా కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇప్పటికే హార్మూజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించింది. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించింది అంటూ ఇరాన్ చెబుతోంది. అమెరికా మాత్రం ఇరాన్ వ్యాఖ్యలను ఖండిస్తోంది. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకలపై తాము ఎలాంటి టోల్ వసూలు చేయమని, చర్చలు విఫలమైతే వసూలు చేస్తామంటూ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
అమెరికా – ఇరాన్ మధ్య శాంతి ఒప్పంద చర్చలు మొదలవుతున్న సమయంలో ట్రంప్ ఓ అల్టిమేటం జారీ చేశారు. వంద రోజులకు పైగా సాగిన యుద్ధంలో ఇరు దేశాలు నష్టపోయాయి. మొత్తానికి ఎట్టకేలకు శాంతి ఒప్పందం కుదరడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆదివారం నుంచి స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య శాంతి ఒప్పంద చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమెరికా – ఇరాన్ మధ్య 60 రోజుల తాత్కాలిక కాల్పుల ఒప్పందం జరిగింది. ఈ గడువులోపు ఇరు దేశాల మధ్య శాశ్వత ఒప్పందం కుదరాలి. ముఖ్యంగా అణు చర్చలు సఫలమవ్వాలి. ఈ చర్చలు విఫలమైతే మళ్లీ కథ మొదటకే వస్తుంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలోనూ, ఆ గడువు ముగిసిన తర్వాత కూడా హార్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకలపై ఎలాంటి టోల్ వసూలు చేయబోమని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే, ఇరాన్‌తో జరిగే అణు చర్చలు విఫలమైతే అమెరికానే స్వయంగా టోల్ విధిస్తుంది అంటూ హెచ్చరించారు.

