తెనాలి నందులపేటలో నూతన బిఎస్ఎన్ఎల్ ఓసిఎస్ కేంద్రం ప్రారంభం

-స్థానికంగానే టెలికాం, ఇతర పౌర సేవలు పొందే అవకాశం

కార్యాలయం ప్రారంభిస్తున్న డీఈ శ్రీనివాసరావు, పక్కనే జేటివో శ్రీధర్, నిర్వాహకుడు సిద్దార్థ

రాష్ట్రవార్త-తెనాలి: బిఎస్ఎన్ఎల్ ద్వారా మరిన్ని సేవలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఔట్‌సోర్స్డ్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (ఓసిఎస్సి) అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బిఎస్ఎన్ఎల్ తెనాలి డివిజన్ డిఈ ఎ శ్రీనివాసరావు తెలిపారు.
స్థానిక నందులపేటలో ఏర్పాటుచేసిన నూతన కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తెనాలి శాఖ జెటిఓ ఎస్ అశోక్‌తో కలిసి కేంద్రాన్ని సందర్శించారు.
డిఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ టెలికాం సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ప్రజలకు అవసరమైన సేవలను అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. జెటిఓ ఎస్ అశోక్ మాట్లాడుతూ తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ కేంద్రం ద్వారా బిఎస్ఎన్ఎల్ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన రీఛార్జీలు, నూతన సిమ్ కార్డులు, ఇంటర్నెట్ కనెక్షన్లు తదితర సేవలను పొందవచ్చని వివరించారు. బిఎస్ఎన్ఎల్ టెలికాం సేవలతో పాటు వివిధ ఆన్‌లైన్ సేవలను సైతం తమ కేంద్రంలో అందుబాటులో ఉంచుతున్నట్లు కేంద్ర నిర్వాహకులు జవంగుల వెంకట సిద్ధార్థ తెలిపారు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 97

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *