మహానాడులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.. నివాళులు అర్పించిన చంద్రబాబు

మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ తెలుగు జాతికి ఆయన చేసిన కృషిని కొనియాడారు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 40

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *