తొలిసారి వైభవ్ సూర్యవంశీ‌ ప్రతిభను గుర్తించింది అతనే!

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ మరోసారి టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్‌గా మారాడు. ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(29 బంతుల్లో 97 పరుగులు ) సునామీ బ్యాటింగ్‌తో చెలరేగాడు.

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ మరోసారి టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్‌గా మారాడు. ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(29 బంతుల్లో 97 పరుగులు ) సునామీ బ్యాటింగ్‌తో చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగులతో విజయాన్ని అందుకొని క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.

ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఈ సిక్సర పిడుగు ప్రతిభను తొలిసారి గుర్తించింది ఎవరా? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. తొలిసారి వైభవ్ సూర్యవంశీ ప్రతిభను బిహార్ మాజీ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ నెట్ బౌలర్ సమర్ ఖాద్రి గుర్తించాడు. బిహార్ లోని ఓ స్థానిక మ్యాచులో వైభవ్ సిక్సర్లకు ఆయన ఫిదా అయ్యాడు.

ఓసారి రాజస్థాన్ రాయల్స్ మాస్టర్ మైండ్ జుబిన్ టాలెంటెడ్ ప్లేయర్లను గుర్తించాలని సమర్‌కు సూచించగా ఆయన వైభవ్ పేరును పరిచయం చేశాడు. చెన్నైలో స్కౌటింగ్ ట్రయల్‌లో ఆ చిచ్చరపిడుగు 60 బంతుల్లోనే 150పైగా పరుగులు చేశాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతులను కూడా వైభవ్ ఈజీగా బాదడంతో రాజస్థాన్ స్కౌటింగ్ జట్టు ఆశ్చర్యపోయింది.

వైభవ్ సూర్యవంశీ గురించి అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు సమర్ ఖాద్రి చెప్పాడు. ద్రావిడ్ పరీక్షించ చేసి మరి ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లకు కొనుగోలు చేశాడు. గత సీజన్‌లోనే అవకాశం కల్పించగా.. ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో కూడా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా వైభవ్ కొనసాగుతున్నాడు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 40

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *