
తెనాలిలో..ఏడుకొండల స్వామికి ఉదయాస్తమాన సేవలు
రాష్ట్రవార్త తెనాలి :
సర్వాలంకార భూషితుడై ఉదయాస్తమాన సేవలతో, ఏడుకొండల వేంకటేశ్వరస్వామి భక్తులను తరింపజేసారు.
శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్యాత్మిక సేవలలో భాగంగా, బాలాజీరావుపేట ప్రియాడీలక్స్ ఎదుటగల నారాయణ అష్టాక్షరీ క్షేత్రంలో ఆదివారం ఏడుకొండల స్వామికి ఉదయాస్తమాన సేవలు కన్నుల పండువగా వీనుల విందుగా, తిరుమలలో మాదిరిగా వైఖానస పండితులు పూజా విధులు నిర్వహించారు. శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్ధాపక అద్యక్షులు రొంపిచర్ల కిరణ్ కుమార్ పర్యవేక్షణలో, సుప్రభాత సేవ నుండి, పవళింపు సేవ వరకు నిర్వహించిన ఆద్యాత్మిక సేవలలో విశేషంగా భక్తులు మేము సైతం అంటు సతీ సమేతులై ఉభయ సేవలలో పాల్గొన్నారు. సుప్రభాత సేవ, అభిషేకం, తోమాలసేవ, కొలువు, సహస్రనామార్చన, శ్రీవారికల్యాణం, గరుడోత్బవ సేవ, మేళతాళములతొ, వేధమంత్రాలతొ, కోలాట భజనలతో, బాలాజీ రావు పేట పలు కూడళ్ళమీదుగా నిర్వహించారు.ఏకాంత సేవతొ ఉదయాస్తమాన సేవలు తగు ప్రాధాన్యతను చాటుకున్నాయి. శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ కార్యావర్గం, మహిళా భక్తులు కార్యక్రమాలకు సహకరించారు.
