సినీ నటునిగా, దర్శకునిగా, రచయితగా, నిర్మాతగా, గీత రచయితగా వెయ్యి విద్వత్తుల బలం సాధించిన దర్శక రత్న దాసరి నారాయణరావు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పలువురు వక్తలు నివాళులర్పించారు. తెనాలి కల్చరల్ ఫిలింసొసైటీ ఆధ్వర్యంలో దాసరి 9వర్దంతి శనివారం ఘనంగా నిర్వహించారు. సభకు రాష్ట్రవార్తసంపాదకులు కంకిపాటిరమేష్ కుమార్ ఆద్యక్షతవహించి, మాట్లాడుతూ రచయితగా, దర్శకుడు, రాజకీయ నాయకునిగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ దాసరి నారాయణరావు పేరు నేటికీ చిరస్థాయిగా మార్మోగుతుందన్నారు.హీరోచుక్కాని,దర్శకులకు కేప్టెన్ అని ఇర్దేశించినవారుదాసరినారరణరావుఅన్నారు.
దర్శకునిగా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారని దాదాపు 63 సినిమాల్లో రకరకాల పాత్రలో హస్యాన్ని, సెంటిమెంటును పండించి వినూత్న శైలి కనబరిచారన్నారు. రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, వందలాది సన్మానాలు సత్కరాలు అందుకున్నారనిఅన్నారు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా ప్రజాసేవ చేశారనికొనియాడారు.
దాసరి వందలాదిమంది దర్శకులను తయారు చేశారని విశ్వవ్యాప్తంగా ఖ్యాతిని పొందారని దాసరి రూపొందించిన చిత్రాలన్నీ ఆణిముత్యాలు అన్నారు దాసరి శకం తెలుగు సినీ పరిశ్రమకు దిక్సూచి లాంటిది అన్నారు.250 చిత్రాలకు పైగా మాటలు రచయితగా దర్శకునిగా నటునిగా ఆయన ప్రయాణం అనితర సాధ్యమన్నారు. ఆయన స్ఫూర్తితో నేటితరం ముందుకు సాగాలన్నారు.
దాసరి నారాయణరావు బహుముఖప్రజ్షచాలి దాసరిఅనిఆయన కొనియాడారు.తెలుగుసీనిమాకుయుగకర్త దాసరి నారాయణ అనికొనియాడారు.ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర ఉత్తమనటునిగాఅవార్డుపొందారు.దాసరిశకంతెలుగుసినిమాకు స్వర్ణయుగంఅని చెప్పారు. సాహితివేత్త ప్రొఫెసర్ పాతూరిసుబ్రమణ్యం మాట్లాడుతూ దాసరినారయణరావుపాటలువిన్నూత్నమైనబావాలతోఆకట్టుకున్నాయనిచెప్పారు.
ముందుగా గాయకులు సాహితీవేత్తలు, నటులు పూలమాల వేసిననివాళా ర్పించారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు మార్కండేయులు.ఓ,చందుఅనురాధ, చందు సూర్య,బొమ్మురామకృష్టారెడ్డి,వెంకట్,అంబటి కిరణ్ కుమార్,యామిని స్వామి, తదితరులుపాల్గొన్నారు. దాసరిచిత్రాలలోనిపాటలను అనురాధ,యామిని అలపించారు.
