రూ.9 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న చిన్న సినిమా..

ఇటీవలకాలంలో సినీ పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల కంటే ప్రాంతీయ సినిమాలే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలే భారీ వసూళ్లకు చిరునామాగా ఉండేవి. కానీ, ఇప్పుడు చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రాంతీయ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజాగా మరాఠీ సినిమా ‘దేవూల్ బంద్ 2′(Deool Band 2 Collection) బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రవీణ్ తార్డే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భక్తి, సామాజిక అంశాలు, భావోద్వేగాలను కలగలిపి రూపొందించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రేక్షకులు ఈ సినిమాను తమకు దగ్గరైన కథగా భావించడంతో థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది.

