The quality standards of drinking water supply should be monitored from time to time.Municipal Commissioner J. Rama Appalanaidu..

మంచినీటి సరఫరా నాణ్యతా ప్రమాణాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
మున్సిపల్ కమీషనర్ జె. రామ అప్పలనాయుడు


రాష్ట్రవార్త తెనాలి: పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరా చేయువిషయంలో ఎప్పటి కప్పుడు నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా ఉండేలా చూడాలని, వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి సలఫరా సక్రమంగా కొనసాగించాలని మున్సిపల్ కమీషనర్ జె. రామ అప్పలనాయుడు సిబ్బందికి సూచించారు. మంగళవారం విఎస్ ఆర్ ఎన్వీఆర్ కళాశాల సమీపంలోని, రక్షిత మంచినీటి సరఫరా కేంద్రాన్ని మున్సిపల్ కమీషనర్ అప్పల నాయుడు తమ విధినిర్వాహణలో భాగంగా పరిశీలించారు.తొలుత బుర్రిపాలెం రోడ్ లోని
పురపాలక సంఘ ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రం కంపోస్ట్ యార్డును ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మొవ్వ ఏసుబాబు , ట్రైనీ కమిషనరలతో కలిసి పర్యటించారు. కంపోస్ట్ యార్డ్ లోని సేంద్రియ ఎరువు తయారీ కొబ్బరి పీచు తయారీ , చెత్త తరలింపు వంటి వివిధ అంశాలపై ట్రైనీ కమీషనర్లకు వివరించారు
ట్రైనీ కమిషనర్ల బృందం, ఇన్చార్జి అసిస్టెంట్ ఇంజనీర్ భాష సిబ్బంది పాల్గొన్నారు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 40

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *