Vijay changes his mind, latest survey effect- unexpected decision..!!
Vijay changes his mind, latest survey effect- unexpected decision..!!
మనసు మార్చుకున్న విజయ్, లేటెస్ట్ సర్వే ఎఫెక్ట్- అనూహ్య నిర్ణయం..!!

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు కూటములతో తల పడుతున్న విజయ్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయిన విజయ్ తాజా వ్యూహాలు ఆసక్తి కరంగా మారాయి. అభ్యర్ధుల ఎంపిక పైన విజయ్ తుది కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల బరిలోకి తొలి సారి దిగుతున్న విజయ్ కు పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. దీంతో, తాను పోటీ చేసే సీటు విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాగా.. విజయ్ తాజా నిర్ణయాలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి.
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. పొత్తులు.. మేనిఫెస్టో ల పైనా స్పష్టత రావటంతో ఇక.. తాను పోటీ చేసే నియోజకవర్గం పైన నిర్ణయం తీసుకున్నారు. తాజా గా విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వేళచ్చేరి, విరుగంబాక్కం, విరుదాచలం వంటి నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ముందుగా భావించినా, చివరికి పెరంబూర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా నియోజకవర్గంలోనే ఉంటూ ప్రచారం చేపట్టాలని విజయ్ నిర్ణయించారు. అందుకోసం కొడుంగై యూర్ కృష్ణమూర్తి నగర్ జవహర్ వీధిలో ఓ భవనాన్ని విజయ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ బంగ్లాను విజయ్ బసతో పాటు పెరంబూర్ నియోజకవర్గం ఎన్నికల కార్యాలయంగా వినియోగించ నున్నారు. అదే విధంగా అభ్యర్ధుల ఎంపిక ఇప్పుడు విజయ్ కు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. అయితే, డీఎంకే బలంగా ఉన్న చెన్నై పరిధిలోనే తాను పోటీ చేయటం ద్వారా పార్టీ అభ్యర్ధులకు మేలు జరుగుతుందని విజయ్ భావిస్తున్నారు. ఈసారి తమిళనాట ఎన్నికలు చతుర్ముఖ పోటీగా మారే అవకాశం కనిపిస్తోంది. సర్వేలతో లెక్క మార్చిన విజయ్ డీఎంకే, అన్నాడీఎంకే కూటములతో పాటు నామ్ తమిళ్ కట్చి (ఎన్టీకే), విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా స్వతంత్రంగా పోటీ చేసే సూచనలు ఉన్నాయి. విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడం, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల సరళిని ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 2021 ఎన్నికల్లో చెన్నై జిల్లాలో డీఎంకే 16 సీట్లను ఏకపక్షంగా గెలుచుకుంది. 1970 నుంచి చెన్నై జిల్లా డీఎంకే కు కంచుకోటగా ఉంది. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఇదే జిల్లా నుంచి బరిలో ఉన్నారు.

