Evening educational development under the aegis of Saimanga...
Evening educational development under the aegis of Saimanga…
సాయిమంగా ఆధ్వర్యంలో… సాయంకాల విద్యా వికాసం..

సాయిమంగా ఆధ్వర్యంలో… సాయంకాల విద్యా వికాసం…
రాష్ట్రవార్త: రేపటి మెరుగైన సమాజ స్ధాపనలో మేముసైతం అంటూ సాయిమంగా వెల్ ఫేర్ సొసైటీ, సామాజిక బాద్యతగా సాయంకాల విద్యా వికాసం అనే విధానంతొ,శుక్రవారం ఐతానగర్ హయ్యర్ పేటలోని, లైబ్రరీలో ఆప్రాంత బడిఈడు చిన్నారులకు సాయం కాల విద్యను, లాలనగా నేర్పించేందుకు, ఓటీచర్ ను ఏర్పాటు చేసి శిక్షణకు శ్రీకారం చుట్టారు. సాయిమంగా వెల్ ఫేర్ సొసైటీ వ్యవస్ధాపక అద్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడుతు సమాజం బాగుకోరే వ్యవస్ధలోని రేపటి పౌరులలొ, బాల్యం నుండి, మెరుగైన ఆలోచనలు పాదుకొలిపే విధంగా తీర్చిదిద్దడంలో మేము సైతం అనే కోణంతొ, సాయంకాల విద్యా వికాసం మిత్రులు, శ్రేయోభిలాషుల సలహాతో ప్రారంభిస్తున్నామని, మంచిని పెంచే మా ఆశయం పదిమంది చిన్నారులకు ఉపయోగ పడినా అదిమాకు ఆనందమే అన్నారు. అంబటి శ్యామ్ సాగర్ మాట్లాడుతు చిన్నారులకు సాయిమంగా వెల్ ఫేర్ సొసైటీ విధానాలను వివరించారు. బాల్యం నుండి చిన్నారులు తల్లిదండ్రుల పట్ల, గురువులపట్ల, అతిధుల పట్ల ఎలా మెలగాలో సంస్ధ సభ్యుడు ఎవి.సత్యదేవ్ స్వామి వివరించారు. మంచి విషయాలు తెలుకుని విద్యార్ధి దశను సక్రమంగా మలుచుకోవాలని చెప్పారు. ఈసందర్భంగా చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్ధ కార్యదర్శి సుధాకర్, సబ్యులు బి. రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు


