TTD: Here is the secret behind the *Mudupu* (vow-offering) made at the Tirumala Lord’s Hundi—it is said that the offering yields results only when made in this specific way!
TTD : తిరుమల స్వామివారి హుండీ ముడుపు సీక్రెట్ ఇదే.. ఇలా ముడుపు కడితేనే ఫలితం ఉంటుందట!

TTD Tirumala Tirupati Devasthanams : మనలో ప్రతి ఒక్కరం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి హుండీలో కానుకలు, ముడుపులు వేస్తాం.. కోరికలు నెరవేరాలని కోరుకుంటాం. అయితే ఈ హుండీలో కానుకలు, ముడుపులు వెనుకు దాగి ఉన్న కొన్ని విషయాలను తెలుసుకుందాం..
Tirumala Venkateswara Swamy Hundi Secrets : ప్రపంచంలో (Tirumala Venkateswara Temple) ఆలయానికి ఉంది. అదేమిటంటే హుండీలో కోట్ల రూపాయలు వచ్చి పడుతూ ఉంటుంది. అక్కడ ఎలా వస్తున్నాయి? ఎందుకు అక్కడే అన్ని డబ్బులు వేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం ఏమిటంటే శంకరాచార్యుల వారు అక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు. అందుకుని అక్కడ ఆ వైభవం ఉంటుందని చెబుతారు. అయితే.. శంకరాచార్యుల వారు ప్రతిష్టించిన శ్రీ చక్రం మహా శక్తిమంతమైనదే కానీ.. శంకరాచార్యుల వారు ఎన్నో ఆలయాల్లో శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు. కానీ అక్కడెక్కడా రాని సంపద తిరుమలోనే ఎందుకు వస్తుందంటే.. ఆ Tirumala Devasthanams హుండీకి ఒక రహస్యం ఉంది. ఆ హుండీకి ఉన్న రహస్యం పద్మ పురాణంలో ఉందట.
పద్మ పురాణం ప్రకారం.. స్వామి కలియుగాంతం వరకు కుబేరుడుకి వడ్డీ చెల్లించడం ఎందుకు అని అమ్మవారే ఈ ప్రశ్నను స్వామి వారిని అడిగింది. నేను మీ హృదయం మీద ఉన్నాను మీ అప్పు ఒక్క నిమిషంలో తీర్చేస్తాను అని అమ్మవారు అంటే.. అప్పుడు స్వామి వారు ఏమన్నారంటే.. దేవీ నీవు నా దానివై ఉండగా.. నేను కుబేరుడి దగ్గర అప్పుతీసుకోవడం ఎందుకు.. నేనడిగితే కనక వర్షం కురిపించవూ.. కానీ ఎందుకు తీసుకున్నానో తెలుసా? అని అప్పుడు స్వామి వారే ఆ రహస్యాన్ని చెప్పారట..

