రోటరీ ఆంధ్రాప్యారీస్ అద్యక్షులుగా… డాక్టర్ కనగాల మధుసూధనప్రసాద్

రాష్ట్రవార్త తెనాలి:
రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి, సంస్ధ నూతన కమిటీ అధ్యక్షులుగా కనగాల మధుసూధన ప్రసాద్, కార్యదర్శిగా ఎర్రగుంట్ల మహేష్ బాబు, కోశాధికారిగా గుండపనేని కృష్ణయ్య గార్ల చే ఇమీడియట్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ రోటేరియన్ డాక్టర్ సోమవరపు వెంకటరాం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు,
స్ధానిక ఆర్టీసి డిపో ఔట్ గేట్ ఎదుటగల ఈ కన్వెంక్షన్ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం ఆహ్లాద భరిత వాతాలరణంలో, రోటరీ ఆంధ్రా ప్యారీస్ నూతన కమిటి ప్రమాణ స్వీకార ఉత్సవం నిర్వహించారు.

ఈక్రమంలోప్రెసిడెంట్ ఎలెక్ట్ గా గాజుల విజయ సారధి, డైరెక్టర్లుగా మున్నంగి శ్రీనివాసరావు, జాస్తి వినోద లక్ష్మి,చావలి కిరణ్, కల్లూరి శివరామకృష్ణ, మైనేని రత్న ప్రసాద్, గొట్టిముక్కల చందు, కుర్ర శ్రీహరి, కాసర నేని మోహన్, కళ్ళం ఆనంద్ కుమార్, మైల శ్రావణ్ కుమార్, కుంభం బాలాజీ ల చే, అసిస్టెంట్ గవర్నర్ జంగాల వెంకటేష్ ప్రమాణం స్వీకారం చేయించారు, కార్యక్రమంలో మండల తహశీల్దార్ కె.వి. గోపాల కృష్ణ మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా రోటరీ సంస్ధ సేవా మార్గంలో తన ఆదర్శాన్ని చాటుతుందన్నారు.
రోటరీ గవర్నర్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఈదర వెంకట పూర్ణ చంద్ మాట్లాడుతు రోటరీ చేసే సేవా కార్యక్రమాలు, స్నేహ పూర్వక, సేవా తత్పరత గురించి తెలియజేశారు,రోటరీ ఆంధ్రాప్యారీస్ నూతన అద్యక్షుడు డాక్టర్ కనగాల మధుసూధన ప్రసాద్ మాట్లాడుతు మనిషి బ్రతుకుతూ తన తోటి వారికోసం ఎంతో కొంత సేవ చేయడం మంచి సమాజం ఏర్పాటుకు దోహదమని భావించే తనకు, రోటరీ లో సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. తన పదవికీ వన్నె తెచ్చే విధంగా తన వంతు సేవలు అందిస్తామన్నారు.
కార్యక్రమంలో గుత్తా వెంకటరత్నం,నల్లూరి వెంకటేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వరరావు వివిధ క్లబ్బుల రోటరీ సభ్యులు పాల్గొన్నారు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 73

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *