Water tax collections must be expedited.

Municipal Regional Director Suryadevara Harikrishna
రాష్ట్రవార్త తెనాలి:పురపాలక సంఘ పరిదిలో త్రాగునీటి సౌలభ్యం పొందుతూ, త్రాగునీటి పన్ను చెల్లించే విషయంలొ ప్రజలు సహకరించాలని, అధికారులు కూడా వాటర్ ట్యాక్స్ వసూళ్నను వేగవంతం చేయాలని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ సూర్యదేవర హరికృష్ణ రివ్యు సమవేశంలో సూచించారు. విధి నిర్వాహణలో భాగంగా శనివారం తెనాలి పురపాలక సంఘాన్ని సందర్శించిన రీజినల్ డైరెక్టర్ హరికృష్ణ తొలుత మున్సిపాలిటీ పరిధిలోని కంపోస్ట్ యార్డ్‌ను పరిశీలించారు
ఈ సందర్భంగా కంపోస్ట్ యార్డ్‌లో జరుగుతున్న వర్మీ కంపోస్ట్ తయారీ, కోకోపీట్ తయారీ, సేంద్రియ వ్యర్థాల నిర్వహణ ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సేంద్రియ వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేసి, ఉపయోగకరమైన కంపోస్ట్‌గా మార్చే విధానంపై సంబంధిత అధికారులు, సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్నారు మున్సిపాలిటీలో అమలు చేస్తున్న ఘన వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ వ్యర్థాల ప్రాసెసింగ్ కంపోస్టింగ్ విధానాలను పరిశీలించారు. అనంతరం పురపాలక సంఘ కార్యాలయంలోని, కమీషనర్ చాంబర్ లొ, ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ వసూళ్ళ వివరాలు పరిశీలించిన రీజినల్ డైరెక్టర్, వాటర్ ట్యాక్ వసూళ్ళు వేగవంతం చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ జెఆర్. అప్పల నాయుడు, ఎమ్ హెచ్ ఒ మొవ్వా ఏసుబాబు, వివిధ విభాగాల అధికారులు సిబ్బంది ఉన్నారు.


		
rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 88

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *