Rotary Vaikunthapuram provides nutritious food to pregnant women

రోటరీ వైకుంఠపురం ఆధ్వర్యంలొ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ
రాష్ట్రవార్త తెనాలి:
సామాజిక సేవాకార్యక్రమాలు ఓకార్యాచరణగా కొనసాగిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం
కార్యవర్గం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు.స్ధానిక సాలిపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ లొ, శనివారం రోటరీ వైకుంఠపురం అద్యక్షులు గుమ్మడి సరోజ్ బాబు, తదితర సభ్యుల ఆధ్వర్యంలో, 30,మంది గర్భిణీ స్త్రీలకు, పౌష్టికాహరం కిట్లను అందజేశారు. ఈసందర్బంగా క్లబ్ అద్యక్షులు గుమ్మడి సరోజ్ బాబు మాట్లాడుతు రోటరీ సేవా కార్యక్రమాల్లో భాగంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అవసరం ఉన్నందున, ఎంపిక చేసిన గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేశామన్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా, శివాజీ చౌక్ లొ, 13వ, తేదీ మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ జీవన్ లత మాట్లాడుతు అర్బన్ హెల్త్ సెంటర్ కు వచ్చేగర్భిణీ స్త్రీలకు అవసరమై, అధిక ప్రొటీన్లు లభించే, పౌష్టికాహారం అందజేసేందుకు సహకరించిన అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ జిల్లా నాయకులు ఈదర వెంకట పూర్ణ చంద్, రోటరీ వైకుంఠపురం కార్యదర్శి కొల్లి రాజేంద్రప్రసాద్,
తదితర సభ్యులు పాల్గొన్నారు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 88

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *