స్ధానిక సంస్ధల్లో..జనసేన పోటీ తధ్యం

మంత్రి నాదెండ్ల మనోహర్

రాష్ట్రవార్త తెనాలి:
సార్వత్రిక ఎన్నికల లెక్క వేరు, స్ధానిక సంస్ధల ఎన్నికల లెక్కవేరని అప్పటి ఫార్ములా ఇప్పుడు అమలు చేయబోమని పార్టీ సంస్ధాగతంగా బలంగా ఉన్నచోట జనసేన పోటీ చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కుండ బద్ధలు కొట్టాడు.
పట్టణంలోని చెంచుపేట, అమరావతి ప్లాట్స్ పరిదిలోని, 30,31,32,వార్డులలో శుక్రవారం ఉదయం నుండి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులు, స్ధానిక పార్టీ శ్రేణులతో కలిసి, విస్త్రుతంగా పర్యటించారు. ప్రతి వార్డులు ప్రజలను పలుకరిస్తు, స్ధానికంగా ఉన్న సమస్యలను, ప్రజల వ్యక్తిగత సమస్యలను తెలుసుకున్నారు. పలు సమస్యలకు పరిష్కారం చూపేవిధంగా అధికారులకు, క్షేత్ర స్ధాయి సిబ్బందికి పలు సూచనలు చేశారు.కొన్ని చోట్ల సిబ్బంది తీరుపై, ఒక్కింత అసహనం వ్యక్తం చేశారు. ఆయా వార్డులలో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు, 10కోట్ల 50లక్షల మేర నిధులతొ పలు అభివృధ్ధి పనుల విషయమై, అధికారులకు సూచనలు చేశారు. పర్యటన మధ్యలో మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జనసేన పార్టీ సంస్ధాగతంగా బలంగా ఉన్న చోట్ల, స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు.జిల్లా స్ధాయి,పార్లమెంట్ స్ధాయి కమిటీలు వేయనున్నట్లు తెలిపారు.కూటమి ఐఖ్యతను కాపాడుతు, పార్టీ అద్యక్షుల నిర్ణయం మేరకు పని చేస్తామన్నారు, యువత, మహిళ పార్టీకోసం క్రియా శీలకంగా పని చేయాల్సిన అవసరం, ఆదిశగా పనిచేసే వారికి తగుప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ జెఆర్. అప్పలనాయుడు, తహశీల్దార్ కెవి. గోపాలకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్, బిజెపి జిల్లా ఉపాద్యక్షుడు కటారి వాసుదేవనాయుడు, మాజీ కౌన్సిలర్లు మానసారెడ్డి,జైపాల్, కాకాని రఘు, షేక్ జాని, గుమ్మడి నారాయణరావు, స్టాలిన్, కరిముల్లా, రావి దత్తు, డివిఎస్కె సాయి, కోగంటి శంకర్రావు, జనసేన శ్రేణులు, వీరమహిళలు పాల్గొన్నారు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 73

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *