Milad-un-Nabi Rally: MLA Ganababu flags off the event. ముస్లిం మత గురువులు, చిన్నారులతో కలసి ర్యాలీలో పాల్గున్న ఎమ్మెల్యే గణబాబు రాష్ట్రవార్త-గోపాలపట్నం: పవిత్ర మిలాద్- ఈ-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని గోపాలపట్నం తాహా మసీదు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు భారీ శాంతి ర్యాలీని నిర్వహించారు. బుధవారం ప్రభుత్వ విప్, పెందుర్తి నియోజకవర్గం శాసన సభ్యులు పెతకంశెట్టి గణబాబు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఈ-ఉన్-నబీ సర్వమానవాళికి ఎంతో పవిత్రమైన రోజని అన్నారు. ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సమభావం, సోదరభావం ప్రపంచానికి ఆదర్శమని, ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ మిలాద్-ఈ-ఉన్-నబీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటి డైరెక్టర్ & ఇస్లామిక్ వెల్ఫేర్ కమిటి అధ్యక్షులు షేక్ మెహబూబ్ సుభాని, మసీదు కమిటి అధ్యక్షులు నసీర్ ఖాన్, తాజ్, కాసిం, అలీ, జిలాని, బొఖారి, ఖాదరి ఖలీల్, నందమూరి నగర్ కమిటి అధ్యక్షులు ఎస్.కె. నాగూర్, ముస్లిం సోదరులు, మత పెద్దలు పాల్గున్నారు.