Milad-un-Nabi Rally: MLA Ganababu flags off the event.

Milad-un-Nabi Rally: MLA Ganababu flags off the event.
ముస్లిం మత గురువులు, చిన్నారులతో కలసి ర్యాలీలో పాల్గున్న ఎమ్మెల్యే గణబాబు
రాష్ట్రవార్త-గోపాలపట్నం:
పవిత్ర మిలాద్- ఈ-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని గోపాలపట్నం తాహా మసీదు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు భారీ శాంతి ర్యాలీని నిర్వహించారు. బుధవారం ప్రభుత్వ విప్, పెందుర్తి నియోజకవర్గం శాసన సభ్యులు పెతకంశెట్టి గణబాబు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఈ-ఉన్-నబీ సర్వమానవాళికి ఎంతో పవిత్రమైన రోజని అన్నారు. ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సమభావం, సోదరభావం ప్రపంచానికి ఆదర్శమని, ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ మిలాద్-ఈ-ఉన్-నబీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటి డైరెక్టర్ & ఇస్లామిక్ వెల్ఫేర్ కమిటి అధ్యక్షులు షేక్ మెహబూబ్ సుభాని, మసీదు కమిటి అధ్యక్షులు నసీర్ ఖాన్, తాజ్, కాసిం, అలీ, జిలాని, బొఖారి, ఖాదరి ఖలీల్,
నందమూరి నగర్ కమిటి అధ్యక్షులు ఎస్.కె. నాగూర్, ముస్లిం సోదరులు, మత పెద్దలు పాల్గున్నారు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 88

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *