ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా ఉన్న సీజన్ ఇదే. ఐపీఎల్ 2026 ఆరంభం నుంచి గాయాల సమస్యతో జట్టుకు దూరమైన ధోనీ.. సీజన్ మధ్యలో ఫిట్నెస్ సాధించినా ప్లేయింగ్ 11లోకి కావాలనే రాలేదు. చెపాక్ వేదికగా జరిగిన సీఎస్కే చివరి మ్యాచ్‌లో కూడా ధోనీ ఆడకపోవడం అభిమానులను నిరుత్సాహపరిచింది. ధోనీ ఐపీఎల్‌కు సైలెంట్ రిటైర్మెంట్ ప్రకటించాడని అంటున్నప్పటికీ.. తాజాగా సీఎస్కే సీఈఓ కాశీవిశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలతో అభిమానులు ఐపీఎల్ 2027కి ధోనీ తిరిగి వస్తాడనే ఆశ పెట్టుకున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ధోనీని చూడటం కోసం స్టేడియం మొత్తం కిక్కిరిసింది. ఇదే ధోనీ చివరి మ్యాచ్ అని చెప్పడంతో కచ్చితంగా మిస్టర్ కూల్ ప్లేయింగ్ 11లో ఉంటాడని అందరూ భావించారు. అందరూ ఊహించినట్టే టీమ్ బస్‌లో నుంచి కూడా ధోనీ దిగాడు. కానీ, అందర్నీ నిరుత్సాహపరుస్తూ మ్యాచ్‌కి ధోనీ దూరమయ్యాడు. ధోనీ జట్టులో లేకపోవడానికి పూర్తి నిర్ణయం అతడిదే!




