పారిశుధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

I will work towards resolving sanitation issues.
రెండో వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం: వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి వంపుగళ్ల రాణి
తెనాలి: రెండో వార్డులో పారిశుధ్య సమస్యల పరిష్కారంతో పాటు వార్డు సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని వైఎస్సార్‌సిపి కౌన్సిలర్ అభ్యర్థి వంపుగళ్ల రాణి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో సోమవారం ఇంటింటికీ పర్యటించిన ఆమె ఓటర్లను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. అలాగే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మద్దాళి శేషాచలం, తోటి కౌన్సిల్లర్లను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ, తనను గెలిపిస్తే పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. వీధులను పరిశుభ్రంగా ఉంచడం, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడం తన ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాణి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెండో వార్డు అభివృద్ధి కోసం ఫ్యాను గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో వంపుగళ్ల గోపి, ఆట్ల గోవర్ధన్ రెడ్డి, మధిర ప్రసాద్, వంపుగళ్ల సురేష్, అందె దాసు, కాకి ఏసుబాబు, గోళ్ళ మార్క్, కాకి సాంబయ్య, అందె నరేష్ తదితరులు పాల్గున్నారు.
