తెనాలి వాసి దారుణ హత్య
సుపారీ గ్యాంగ్‌తో కిడ్నాప్.. ఆపై హతమార్చినట్లు అనుమానాలు

Brutal Murder of Tenali Resident
Suspected kidnapping by a contract-killing gang, followed by murder.
తెనాలి:రాష్ట్ర వార్త. అక్రమ సంబంధం నేపథ్యంగా మరో దారుణ హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెనాలి ప్రాంతానికి చెందిన వ్యక్తిని సుపారీ గ్యాంగ్‌తో కిడ్నాప్ చేయించి అనంతరం హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలోని భట్టిప్రోలు ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ హత్యోదంతంలో పాల్గొన్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందినట్లు తెలుస్తోంది.
పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు తెనాలి మండల పరిధిలోని సోమసుందరపాలెం గ్రామం సమీపంలో చుక్కా కోటిలింగయ్య అలియాస్ మహేష్ తన స్కూటీ, చెప్పులను అక్కడే వదిలి అదృశ్యమైన ఘటన తెలిసిందే. సోమవారం అతడు హత్యకు గురైనట్లు వచ్చిన సమాచారం వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు, స్థానికుల్లో ఆందోళన నెలకొంది. కోటి లింగయ్య కి భార్య ఉండగానే దీప్తి అనే మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగుతోందన్న ప్రచారం ఈ ఘటనకు కారణంగా అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో హతుడు బావమరిది రాజేష్ సుపారీ గ్యాంగ్ తో కిడ్నాప్ చేయించి, అనంతరం కోటిలింగయ్యను హత్య చేయించినట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందినట్లు తెలుస్తోంది. భట్టిప్రోలు వోలేరు ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు కిరాయి హాంతకులుగా వ్యవహరించినట్లు సమాచారం.
మహేష్‌కు చెందిన స్కూటీ, చెప్పులు తెనాలి మండల పరిదిలోని సోమసుందరపాలెం సమీపంలో లభించడంతో ఇటీవల అతడి అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. పక్కా ప్రణాళికతోనే మహేష్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారా అన్న కోణంలోనూ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
ఈ కేసులో ప్రధాన అనుమానితుడు రాజేష్ అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్లు తెలుస్తోంది. హత్య వెనుక కీలక వాస్తవాలు, సుపారీ ఎంతకు కుదిరింది? కోటిలింగయ్యను ఎక్కడికి తీసుకెళ్లారు, హత్యకు ఖచ్చితమైన గల కారణాలు పోలీసుల దర్యాప్తులో సమాధానాలు లభించాల్సి ఉంది. పోలీసుల అధికారిక ప్రకటన వెలువడిన అనంతరం ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
