బుర్రిపాలెం బుల్లోడు కి గ్రామస్తుల ఘన నివాళి …

రాష్ట్ర వార్త తెనాలి:
తెలుగు చలనచిత్ర రంగంలో డేరింగ్ డాషింగ్ హీరోగా అభిమానుల హృదయాలను దోచుకున్న సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని అభిమానులు ఆయన విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు
మండలంలోని బురిపాలెం గ్రామంలో సూపర్ స్టార్ కృష్ణ 83వ,జయంతిని పురస్కరించుకుని, గ్రామంలోని కృష్ణ విగ్రహానికి అభిమానులు పూలదండలు వేసి సూపర్ స్టార్ కృష్ణకు జోహార్లు పలికారు. ఈ కార్యక్రమంలో శాఖమూరి కిషోర్, శాఖమూరి చందు, ఘట్టమనేనిచిట్టిబాబు, సాంబయ్య, రవి, కృష్ణ, లక్ష్మయ్య, పిచ్చయ్య , కే సురేష్ తదితరులు పాల్గొన్నారు.
- చినరావూరు పార్కు సెంటర్లో…
సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమానులు చినరావూరు పార్కు సెంటర్లో ఆఆదివారం ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. వన్ టౌన్ సిఐ, సిహెచ్ రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని, కృష్ణ అభిమానులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి వారితో తమ ఆనందాన్ని పంచుకున్నారు. రోజుకు 18 గంటలు సినిమా షూటింగులకు కేటాయించిన సూపర్ స్టార్ కృష్ణ నిర్మాతలకు శ్రేయోభిలాషి అని సిఐ రాంబాబు సూపర్ స్టార్ కృష్ణ కు నివాళి అర్పించారు. కార్యక్రమంలో తాడి బోయిన హరిప్రసాద్, పెరుగు చినబాబు, మైక్ మురళి, పలు ప్రాంతాల నుండి వచ్చిన కృష్ణా అభిమానులు పాల్గొన్నారు. - తెనాలి బండుపైన
పద్మభూషణ్, నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతిని, స్థానిక తెనాలి బండి పై ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహం వద్ద, సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానులు అశేష సంఖ్యలో పాల్గొని పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సీనియర్ అభిమాని, ఆంధ్ర పారిస్ చిత్ర సంస్థ అధినేత ఈదర వెంకట పూర్ణచంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చలనచిత్ర రంగంలో, సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారని, వెండితెర వెలుగులను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారని కొనియాడుతూ నివాళి అర్పించారు. నిర్మాతలు మెచ్చిన హీరో సూపర్ స్టార్ కృష్ణ అని అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ జోహార్లు పలికారు. ఈ కార్యక్రమంలో కే యశ్వంత్ కుమార్, షావుల్ సయ్యద్, షబ్బీర్ అఖిల్, గుమ్మడి ప్రసాద్, జి సాయి, కృష్ణ మహేష్ బాబు అభిమానులు పాల్గొన్నారు.


