నాజరుపేటలో దారుణం… భూ వివాదంలో… కొడుకును కడతేర్చిన తల్లిదండ్రులు

వివరాలు వెల్లడించిన ఒన్ టౌన్ సి ఐ, సిహెచ్. రాంబాబు
రాష్ట్రవార్త తెనాలి:
మానవ సంబంధాలు కేవలం ఆర్ధిక సంబంధాలే అనే వ్యాఖ్యను నిజం చేస్తు న్న ఘోరమైన ఉదంతమిది. ఆస్తి అమ్మి డబ్బులిస్తే ఆటో కొనుక్కుంటా అంటు, ఆతల్లి దండ్రులను తరచు వేధించే కుమారుడి తీరుపై తిరగబడ్డ తల్లిదండ్రులు ఏకంగా గొంతుకోసి కుమారుడిని కడతేర్చిన ఉదంతమిది.ఒన్ టౌన్ పోలీసుల కదనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్ధానిక నాజరుపేట ఇంద్ర టవర్స్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్ లో, కొల్లిపర కోటేశ్వర్రావు అనే ఆటోడ్రైవర్, తన తల్లితండ్రులు భాస్కర్రావు, విజయమ్మలతొ కలిసి జీవీస్తున్నారు. కోటేశ్వర్రావుకు వివాహమైన కుటుంబ కలహాల నేపధ్యంలొ భార్యనుండి విడిపోయి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నాడు. ఆటో డ్రైవర్ గా జీవనం సాగించె కోటేశ్వర్రావు మధ్యానికి బానిసై, తాగి వచ్చిన ప్రతి సారి తల్లిదండ్రులకు ఉన్న రెండున్నర సెంట్ల స్ధలం అమ్మి, తనకు 50వేలు ఇవ్వాలని గొడవపడేవాడు,
బుధవారం రాత్రి కూడా కోటేశ్వర్రావు తల్లిదండ్రులతొ, స్ధలం అమ్మి డబ్బులీయ మని గొడవ పెట్టుకున్నాడు. కోటేశ్వర్రావుకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అతని పేరు
మరియదాసు రాత్రి జరిగిన ఘర్షణలో తమ్ముడు మరియదాసు కూడా ఉన్నాడు. వాగ్వివాదం తీవ్రమై దాడులకు దారి తీసింది. ఈక్రమంలో తల్లి, తండ్రి, తమ్ముడు కలిసి కోటేశ్వర్రావుపై దాడి చేసి గొంతు కోసి హతమార్చారు.
ఈపెనుగులాట గమనించిన స్ధానికులు ఆప్రాంతానికి వెళ్ళగా తలుపులు మూసి వేసారు. కొంత వ్యవధి తర్వాత కోటేశ్వర్రావు శవాన్ని,నల్లటి పెద్ద కవరులో చుట్టి, ఆటోలో తరలించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో, ఇరుగు పొరుగు వారు గమనించి, వారిని ప్రతిఘడించి, ఒన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సి ఐ రాంబాబు ఆధ్వర్యంలో కోటేశ్వర్రావు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులు భాస్కర్రావు, విజయలక్ష్మి,
మరియదాసు లను అరెస్ట్ చేసినట్లు సి ఐ రాంబాబు తెలిపారు. రెండున్నర సెంట్ల భూ వివాదం, ఆర్ధిక సంబంధమై కన్న కొడుకునే కడతేర్చే పరిస్ధితికి దారితీసింది. స్ధానికుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన క్రమంలో, క్లూస్ టీమ్ సంఘటనా స్ధలానికి చేరుకుంది వేలిముద్రలను సేకరించింది.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 73

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *