తెనాలి మున్సిపల్ ఎన్నికలకు 185 పోలింగ్ కేంద్రాలు వెయ్యిమంది ఓటర్లకు ఓ పోలింగ్ కేంద్రం. మున్సిపల్ కమీషనర్ జెఆర్. అప్పలనాయుడు రాష్ట్రవార్త తెనాలి: ప్రతివెయ్యిమంది ఓటర్లకుఒక పోలింగ్ కేంద్రం వంతున, 52వార్డుల తెనాలి పట్టణానికి 185పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మున్సినల్ కమీషనర్ జెఆర్. అప్పలనాయుడు పేర్కొన్నారు.స్ధానిక మున్సిపల్ కార్యాలయంలోని, కమీషనర్ చాంబర్ లొ, శుక్రవారం పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతొ ఏర్పాటు చేసిన సమావేశంలో, గుర్తించిన పోలింగ్ కేంద్రాల పై, ఆయా పార్టీల ప్రతినిధులకు కమీషనర్ జె.రామ అప్పలనాయుడు వివరణ ఇచ్చారు, రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ సూచనల ప్రకారం సాధారణ ఎన్నికల ప్రక్రియ ప్రాధమిక కార్యాచరణను కమీషనర్ అప్పల నాయుడు వివరించారు, శుక్రవారం సాయంత్రం లోగా వ్రాత పూర్వకంగా వచ్చిన అభ్యంతరాలను పరిగణన లోకి తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కమీషనర్ అప్పల నాయుడు మీడియాతొ మాట్లాడుతు పట్టణంలొ 40వార్డులను, 52వార్డులుగా విభజించి, స్టేట్ గెజిట్ ను ఆమోదింప జేశామన్నారు. అదేవిధంగా వార్డుల వారి ఓటర్ల జాబితా విడుదల చేశామని, మూడవ ప్రక్రియగా పట్టణంలోని 1.57లక్షల ఓటర్లకు ప్రతి వెయ్యిమంది ఓటర్లకు, ఒక పోలింగ్ కేంద్రం వంతున 185పోలింగ్ కేంద్రాలను సిద్దం చేసే ప్రక్రియలొ, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించి, వారి సందేహాలను నివృత్తి చేశామన్నారు.2కిలోమీటర్ల వ్యవధి లోపు, పోలింగ్ కేంద్రం ఉండాలన్న నిబంధన మేరకు, ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో, నాలుగు చోట్ల ప్రైవేటు పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ విషయంలో, పోలీస్ బందోబస్తు అవసరం ఉన్నందున, డిఎస్పి, అర్బన్ సి ఐ లను కూడా సమావేశానికి ఆహ్వానించామని, వారి సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇప్పటికే పట్టణంలోని వార్డులలో, ఎస్సీ, ఎస్టి, బిసి ఓటర్లు, మహిళా ఓటర్ల సర్వే జరుగుందని, ఈనెల 21న, ఎస్సి, ఎస్టి, బిసి ఓటర్ల తుది జాబితాను ప్రభుత్వానికి పంపుతామని, తదుపరి జిల్లా కలెక్టర్ ద్వారా వార్డుల వారి రిజర్వేషన్ నిద్దారణ చేస్తారని తెలిపారు. ఈసమావేశంలొ డిఎస్పి బి. జనార్ధనరావు, పట్టణ ఒన్ టౌన్ సి ఐ, సిహెచ్. రాంబాబు, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.