Bank employees take to the streets demanding a five-day work week. ఐదు...పనిదినాల కోసం,రోడ్డెక్కిన బ్యాంక్ ఉద్యోగులు రాష్ట్రవార్తతెనాలి: ప్రస్తుత పరిస్ధితుల్లో బ్యాంకు ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం తగ్గించేందుకు, ఐదురోజుల పని విధానం అమలు చేయాలని కోరుతూ, ఐతానగర్ ఎస్బీఐ కార్యాలయం ఎదుట బ్యాంకు ఉద్యోగులు నిరసన ప్రదర్శన ద్వారా తమ డిమాండ్స్ ఏకరువు పెట్టారు.యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో, శుక్రవారం తెనాలి పట్టణంలోని వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు సమ్మె కు, దిగారు. ఈసందర్బంగా సంఘ నాయకులు తమ సమస్యలను మీడియాకు వివరించారు. ప్రస్తుతం వారానికి ఆరు రోజుల పాటు బ్యాంకులు పనిచేస్తుండటంతో ఉద్యోగులపై పనిభారం, ఒత్తిడి పెరుగుతోందని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఇతర రంగాలలో, వారానికి ఐదు రోజుల పని విధానం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలోనూ ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా బ్యాంకు ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని, ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వారానికి ఐదు రోజుల పని దినాల అంశంపై ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై స్పందన లేకపోతే దశలవారీగా మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ నిరసనలో తెనాలిలోని వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.