At the market yard… under the auspices of the municipality… World Yoga Day Celebrations Held Grandly
మార్కెట్ యార్డ్ లో…. పురపాలక సంఘం ఆధ్వర్యంలో…ఘనంగా వరల్డ్ యోగా డే వేడుకలు …

ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆర్డీఒ కె. శ్రీరమణి
రాష్ట్రవార్త తెనాలి:
ప్రపంచ గుర్తింపు పొందిన మనదైన యోగ సాధన ప్రతి ఒక్కరు దైనందిన చర్యగా కొనసాగించాలని ఆర్డీఓ కె. శ్రీరమణి వరల్డ్ యోగా డే శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక చెంచుపేట మార్కెట్ యార్డులో 12వ జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యోగా డే కార్యక్రమంలో ఆర్డీఓ కె. శ్రీ రమణి , మున్సిపల్ కమిషనర్ జెఆర్.
అప్పలనాయుడు
పలువురు అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనీ. యోగ సాధకుల సమక్షంలో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీ రమణి మాట్లాడుతూ మానసిక ఉల్లాసంతొ పాటు శారీరక ఆరోగ్యం పొందవచ్చని అన్నారు. మున్సిపల్ కమిషనర్ రామా
అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రతిరోజు యోగ సాధన చేయడం వలన అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చని మానసిక ప్రశాంతతను పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు మున్సిపల్ మేనేజర్ జయకర్ , ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మొవ్వ ఏసుబాబు , ఎన్ ఎన్ సి సి ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్ పలువురు అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


