Another virus alert in the country: Symptoms of West Nile Fever—what do experts say?
దేశంలో మరో వైరస్ అలర్ట్, వెస్ట్ నైల్ ఫీవర్ సోకితే శరీరంలో కనిపించే లక్షణాలు! నిపుణులు ఏమంటున్నారు?

వెస్ట్ నైల్ జ్వరం దోమల ద్వారా వ్యాపించే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది వెస్ట్ నైల్ వైరస్ ద్వారా సోకుతుంది. దోమ కుట్టడం ద్వారా ఇది వ్యాపిస్తుంది. అసలేంటి వెస్ట్ నైల్ జ్వరం? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, నివారణ చర్యలేంటి ఇలా పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దేశంలో మరో వైరస్ కలకలం సృష్టిస్తుంది. కేరళంలోని ఎర్నాకులం జిల్లాలో అలువ సమీపంలో ఉన్న కడుంగల్లూరుకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు వెస్ట్ నైల్ జ్వరంతో మరణించినట్లు స్థానిక అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో, కేరళ ఆరోగ్య అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. వారం రోజుల్లో జిల్లాలో దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధితో నమోదైన రెండో మరణం ఇది కావడంతో ఈ కేసు ఆందోళన రేకెత్తించింది.
దీంతో వెస్ట్ నైల్ జ్వరం అంటే ఏంటి, లక్షణాలు ఎలా కనిపిస్తాయని చాలా మందికి క్లారిటీ లేదు. దీని గురించి డాక్టర్ అరవింద ఎస్. ఎన్ ( లీడ్ కన్సల్టెంట్ – ఇంటర్నల్ మెడిసిన్, ఆస్టర్ ఆర్.వి. హాస్పిటల్, బెంగళూరు) పూర్తి వివరాలు అందించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

