Tirupati: What are the benefits of having darshan of Lord Sri Venkateswara Swamy on a Sunday?
ఆదివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

తిరుమలలో శ్రీవారిని వేర్వేరు రోజుల్లో దర్శించుకుంటే వేర్వేరు ఫలితాలు ఉంటాయి. ఆదివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి.
భానుడి సువర్ణ కాంతులతో ధగధగ మెరిసిపోతుంటుంది శ్రీవారి ఆనంద నిలయం. సూర్య నారాయణుడైన, సమస్త ప్రజలను ఆపదలో ఆదుకొనే దైవం అయినా ఈ కలియుగంలో శ్రీ వేంకటేశ్వరుడే. అందుకే పురాణ ఇతిహాసాలు వేంకటేశ్వరునికి సమానమైన దైవం లేదు. వెంకటాచలాన్ని మించిన పవిత్ర ప్రదేశం లేదని స్పష్టం చేస్తుంటాయి. శ్రీవారిని సెలవు దినాల్లో భక్తులు అధికంగా దర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆదివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఆగమ పండితులు ఏం చెప్తున్నారు? తెలుసుకోండి.
రాజాధి రాజులకు ఈ కలియుగంలో మహా ప్రభువు శ్రీ వేంకటేశ్వరుడు. వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మిని కొలువు దీర్చుకుని, అర్చావతార మూర్తిగా స్వామి వారు బ్రహ్మండాన్ని యోగ సృష్టి ద్వారా పరిపాలిస్తున్నారు. శ్రీవారు అనంత కోటి భక్త ప్రియుడు. భక్తుల రక్షణార్థం వైకుంఠాన్ని వీడి ఇలవైకుంఠం అయినా సప్తగిరులపై సాలగ్రామం రూపంలో కొలువయ్యారు స్వామి వారు.
నిత్యం భక్తుల కోర్కెలు నెరవేరుస్తూ కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిగా, భక్త వల్లభుడిగా శ్రీ వేంకటేశ్వరుడు ప్రసిద్ధి చెందారు. నిత్యం స్వామి వారి దర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు తిరుగిరులకు చేరుకుంటారు. ఆ స్వామి శాంత రూపాన్ని దర్శించి మైమరచి పోతారు. తమ మనసులో బాధని స్వామి వారికి చెప్పుకొని తన్మయత్వంలో దర్శనం అనంతరం భయటకు వస్తారు.
స్వామి వారి దర్శనానికి విచ్చేసి యాత్రలో ఎన్నో నియమాలు ఉంటాయి. మరెన్నో సంప్రదాయాలు ముడిపడి ఉంటాయి. ఆ శేష శయనుడు అయినా శ్రీ వేంకటేశ్వరుడిని అధికంగా భక్తులు ఆదివారం నాడు దర్శిస్తారు. అసలు నవగ్రహాధిపతి అయినా సూర్య భగవానుడు ప్రీతికరమైన రోజు, వారం ప్రారంభం అయ్యే రోజైన ఆదివారం దర్శిస్తే రాజ్యానుగ్రహం దక్కుతుందని ప్రతీతి.

