వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృధ్ధి అవసరాల పరిశీలనజిల్లా సంచాలకులు పట్టెన్ శెట్టి రవి సుభాష్

రాష్ట్రవార్త తెనాలి:
వ్యవసాయ మార్కెట్ యార్డు అభివృధ్ధి పనులకు నిధులు సమకూర్చేందుకు జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్ సంచాలకులు పట్టెన్ శెట్టి రవిసుభాష్ సానుకూలత వ్యక్తం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.స్ధానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణాన్ని గురువారం గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్ సంచాలకులు పట్టెన్ శెట్టి రవి సుభాష్ తమ అధికారులతొ తెనాలి మార్కెట్ యార్డ్ ను సందర్శించారు.
తొలుత మార్కెట్ యార్డ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం వ్యవసాయమార్కెట్ కార్యాలయ అధికారులతొ సమీక్షించారు. యార్డ్ కు ఉన్న ఆదాయ వనరుల గురించి తెలుసుకున్నారు.ఈ పర్మిట్ విధానాన్ని తనిఖీ కేంద్రాలలో పూర్తి స్ధాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ఈక్రమంలో యార్డ్ చైర్మన్ తోట దుర్గా ప్రసాద్ యార్డ్ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనుల గురించి వినతిపత్రం అందజేశారు. యార్డు ప్రాంగణంలో డ్రైనేజి వ్యవస్ధకు సైడు కాల్వల నిర్మాణం, ప్రహరీ గోడ ఏర్పాటు అంశాలను ప్రస్తావించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిమ్మకాయల కొనుగోలు షాపులను క్షేత్ర స్ధాయిలో పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. అధికారుల పర్యటన వివరాలను, యార్డ్ కార్యదర్శి డిసిహెచ్. సుబ్బారావు, యార్డ్ చైర్మన్ తోట దుర్గా ప్రసాద్ మీడియాకు వివరించారు. ఈకార్యక్రమంలో ప్రాంతీయసంయుక్త మార్కెటింగ్ సంచాలకులు ఎమ్. దివాకర్, సహాయమార్కెటింగ్ సంచాలకులు పి. సత్యన్నారాయణ
చౌదరి, కార్యనిర్వాహక ఇంజనీర్ కె. శేషగిరిరావు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ డి. కోటయ్య,యార్డ్ కార్యవర్గసభ్యులు, సిబ్బంది ఉన్నారు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 73

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *