
రాష్ట్రవార్త తెనాలి:
డివిజన్ రెవిన్యు కార్యాలయానికి గ్రీవెన్స్ లో వచ్చిన ఓ తల్లి, కొడుకు, జీవన సమస్యను మండల తహశీల్దార్ కెవి. గోపాలకృష్ణ మానవతా కోణంలో పరిష్కరించి వారికి ఆశ్రయం కల్పించారు.
స్ధానిక కోర్టుభవనముల వెనుక, ఎన్వీఆర్ కన్వెంక్షన్ హాలు రోడ్డులో, ఓవృద్దురాలు, ఆమెకు కుమారుడు.మానశిక స్ధితి సరిలేని ఆ ఇరువురు కూడా కొన్ని నెలలుగా ఎండ,వాన, ఏమిపట్టించు
కోకుండా రోడ్డు ప్రక్కనే ఉంటున్నారు.
ఇది గమనించిన, సీనియర్ న్యాయవాది శిరీష, ఆమె కుమారుడు యువ న్యాయవాది గీతాకృష్ణలు, గడచిన సోమవారం ఆర్డీఒ కార్యాలయంలో గ్రీవెన్స్ కు అర్జీ ఇచ్చారు. ఈవిషయంపై ఆర్డీఒ కె. శ్రీరమణి సూచనల మేరకు,బుధవారం మండల తహశీల్దార్ కెవి. గోపాలకృష్ణ ఆప్రాంతానికి వెళ్ళి, రోడ్డుప్రక్కనే ఉన్న, వృధ్ధురాలిని, ఆమె కుమారుడిని పలుకరించి, వారి పరిస్ధితి తెలుసుకున్నారు. మానశిక స్ధితి సరిలేదని గుర్తించిన తహశీల్దార్ గోపాలకృష్ణ, ఆ ఇద్దరికీ, మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే, గాంధీనగర్ లోని
నైట్ షెల్టర్ కు తరలించారు. ఈసందర్బంగా తహశీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతు అనాధలుగా రోడ్డు ప్రక్కన ఇబ్బంది పడేవారిని, ఎవరు గుర్తించినా, ఆసమాచారం, వెంటనే అధికారుల దృష్టికి తెస్తే, అటువంటి వారికి, ఆసరా కల్పింఛడంలో, తమవంతు తోడ్పాటు ఇస్తామన్నారు. గతంలోను ఇటువంటి సందర్భాలను పరిష్కరించామన్నారు. ఓ సీనియర్ న్యాయవాది ఆమె కుమారుడు స్పందించడం ద్వారా, రోడ్డు ప్రక్కనే జీవిస్తున్న వృధ్ధ తల్లీ, కొడుకులకు ఆశ్రయం కల్పించగలిగా మన్నారు.
