
రాష్ట్రవార్త తెనాలి:
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరూ ఆకలితో బాధ పడకూడదని రాష్ట్రంలో 600అన్నా క్యాంటిన్ల ద్వారా 5రూపాయలకే భోజనం లభించేలా చూడటం, నిర్వాహణ తీరుపై ప్రత్యేక దృష్టి పెట్టడం గొప్ప విషయమని, రాబోయే రోజుల్లో మేజర్ పంచాయతీలకు అన్నా క్యాంటిన్ సేవలను తీసుకువెళ్ళే ఆలోచన, కూటమిప్రభుత్వానికి ఉందని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
చెంచుపేట అమరావతి ప్లాట్స్ లో,వార్డుల పర్యటనలో భాగంగా, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం మధ్యాహ్నం తెనాలి ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని అన్న క్యాంటీన్లో భోజనం చేశారు.అన్నా క్యాంటిన్ నిర్వాహణా తీరును పరిశీలించే క్రమంలో, మంత్రి వర్యులు స్వయంగా భోజనం ప్లేటు తీసుకుని అధికారులు, పార్టీ నాయకులతో కలిసి అక్కడే భోజనం చేశారు.అన్నా క్యాంటీన్లో అందిస్తున్న భోజనం నాణ్యత, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసారు. ఎప్పుడు ప్రజలకు నాణ్యమైన ఆహారం, అన్నా క్యాంటిన్ల ద్వారా అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈసందర్భంగా మంత్రి వర్యులు మీడియాతొ మాట్లాడారు. వార్డులలో తమ దృష్టికీ వచ్చిన సమస్యలు, చేపట్టనున్న అభివృధ్ధి పనులను వివరించారు.10కోట్ల 50లక్షల మేర,నిధులు రాబోయే కొద్ది రోజులలోనే అభివృధ్ధి పనులకు వెచ్చించనున్నట్లు తెలిపారు.మంత్రి వర్యుల వెంట మున్సిపల్ కమీషనర్ జెఅర్. అప్పలనాయుడు, తహశీల్దార్ కెవి. గోపాలకృష్ణ,ఎమ్ హెచ్ఒ మొవ్వా ఏసుబాబు,వివిధ విభాగాల అధికారులు,మార్కెట్ యార్డు చైర్మన్ తోట దుర్గాప్రసాద్, మాజీ కౌన్సిలర్లు,తదితర పార్టీ శ్రేణులు, వీరమహిళలు ఉన్నారు.
