
చోరీ సొత్తుస్వాధీనం
రూరల్ సి ఐ, నాయబ్ రసూల్
రాష్ట్రవార్త తెనాలి:
కుటుంబ కలహాల నేపథ్యంలో, భార్య కాపురానికి రాక పోవడానికి తన అత్త కారణమని భావించి ,అత్తగారింట్లోనే చోరీకి పాల్పడిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 7 లక్షలు విలువచేసి 70 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
రూరల్ పోలీస్ స్టేషన్ లో, శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ నాయబ్ రసూల్
కేసు వివరాలను తెలియజేశారు. కొల్లూరు మండలం దోనేపూడి గ్రామానికి చెందిన అయ్యంకి పసి కి,కొలకలూరు కు చెందిన శిరీషతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో గోడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లి ఉంటుంది. అయితే భార్య తనని కాదని వెళ్ళటానికి అత్తే కారణమని భావించిన నిందితుడు అయ్యంకి పసి, ఈనెల 8వ తేదీన కొలకలూరు లోని అత్తగారి ఇంట్లోకి చొరబడి తలుపులు, బీరువా తాళాలు పగులగొట్టి 70 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తెనాలి రూరల్ పోలీసులు, సాంకేతిక ఆధారాల సహాయంతో నందివేలుగు జంక్షన్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును రికవరీ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సిఐ నాయబ్ రసూల్ తెలిపారు.ఈ కేసును త్వరితగతిన ఛేదించిన తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్‌ఐ కె. ఆనంద్ తో పాటు పోలీసు బృందాన్ని డీఎస్పీ బి. జనార్ధన రావు అభినందించారు.
