
రాష్ట్రవార్త తెనాలి:
ఇస్కాన్ సంస్ధ ఆధ్వర్యంలో ఈనెల 20న,జగన్నాధ రధయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు హరేకృష్ణ సింహ గౌరదాస్ పేర్కొన్నారు.
స్ధానిక నాజర్ పేటలోని ఇస్కాన్ కృష్ణ మందిరంలో, శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, తొలుత ప్రచార కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం సింహగౌరదాస్ మాట్లాడుతు జగన్నాధ రదయాత్ర అంతరార్ధాన్ని వివరించారు. భగవంతుడు భక్తుడి దగ్గరకు రావడమే జగన్నాధ రధయాత్ర అని, అలా వచ్చిన భగవంతుని సేవలో తరించడమే రధయాత్ర, ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈనెల 20వ, తేదీ సోమవారం మధ్యాహ్నం 12గంటలకు, బుర్రిపాలెం రోడ్ లోని శివాజీ చౌక్ నుండి ప్రారంభమయ్యే, జగన్నాధ రధయాత్ర, బో్స్ రోడ్ లోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయంకు చేరుకుంటుందన్నారు. రధయాత్రలో భక్తులు, స్వామి వారి రధాన్ని లాగే అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. పలు సాస్క్రతిక కార్యక్రమాలుంటాయన్నారు.సమావేశంలో,అప్పారావు, శ్రీనివాసరెడ్డి,ప్రసాద్, కృష్ణ,గోపాలకృష్ణ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
