18 ఏళ్ల నిరీక్షణ తొలగినవేళ “సంతోష” కు, సంతసం

రాష్ట్రవార్త తెనాలి:
పట్టణం లోని చెంచుపేట 30,31,32 వార్డులను శుక్రవారం మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్న సమయంలో కె. సంతోష అనే మహిళ 18 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులో తన కూతురు మహిత పేరు నమోదు చేయించటం కోసం ఎదురు చూస్తున్నానని, పేరు నమోదు చెయించాలని విన్నవించగా,వెంటనే స్పదించిన రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు,
నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించి, ఇసమస్యకు 24 గంటల్లో పరిష్కారం చూపారు. శనివారం తెనాలి పర్యటన లో సంతోష కు కూతురు మహిత పేరు కలిపి ఉన్న రేషన్ కార్డును మంజూరు చేయించి స్వయంగా పత్రాన్ని అందజేశారు.
అనుకోని విధంగా తన నిరీక్షణ ఫలించడంతొ సంతోష తన సంతోషాన్ని మీడియాతొ పంచుకుంది. మంత్రి వర్యుల ఆదేశాలకు, సకాలంలో స్పందించి, సంతోష సంతోషానికి కారణమైన తహశీల్దార్ కెవి. గోపాలకృష్ణ పనితీరును మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశంశించారు. అన్ని విభాగాల అధికారులు ప్రజా సమస్యల పట్ల ఇదే తరహాలో స్పందించడం ద్వారా కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 73

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *