మాదక ద్వవ్యాల నియంత్రణలో యువత బాధ్యత కీలకంఈగల్ ఛీఫ్ ఐజి ఆకె. రవికృష్ణ

రాష్ట్రవార్త తెనాలి:
మాదక ద్రవ్యాల నియంత్రణపై యువత విస్త్రుతమైన అవగాహనతో ఉండాలని డ్రగ్స్ అలవాటైతే జీవితం నాశనమేనని గుర్తించాలని ఈగల్ ఛీఫ్ ఐజీ ఎకె. రవికృష్ణ, జిల్లా ఎస్పీ వఖుల్ జిందాల్, సంకల్పం కార్యక్రమంలో యువతను హెచ్చరించారు.
స్ధానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో శనివారం మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాసంస్ధ డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అద్యక్షత వహించగా,ఏపీ ఈగల్ చీఫ్, ఐజీ ఎకె. రవికృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తొలుత వివేక విద్యాసంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ ఆధ్వర్యంలో ఐజీ, ఎస్పీకి ఘన స్వాగతం పలికారు.ముందుగా డ్రగ్స్ వ్యతిరేక బ్రోచర్లను ఆవిష్కరించి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం
ఐజీ ఏ.కే. రవికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. విద్య అంటే కేవలం చదువు మాత్రమే కాదని, మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడమని అన్నారు

.యుక్త వయసులో చెడు అలవాట్లకు బానిసైతే తిరిగి సాధారణ జీవితంలోకి రావడం చాలా కష్టమని హెచ్చరించారు. డ్రగ్స్ కేసుల్లో చిక్కుకుంటే ఆ మచ్చ జీవితాంతం వెంటాడుతుందని, అలాంటి కారణాలతో జీవితాలను నాశనం చేసుకున్న ఎంతో మందిని తాను చూశానని తెలిపారు. జీవితంలో డ్రగ్స్‌ జోలికి వెళ్ళవద్దని ఎలాంటి పరిస్ధితిలోనైనా డ్రగ్స్ కు దూరంగా ఉండటం అలవర్చు కోవాలని విద్యార్థులకు సూచించారు.రాష్ట్రంలో “టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్” కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కొన్ని విదేశాల నుంచి డ్రగ్స్ అక్రమంగా దేశంలోకి వస్తున్నాయని,వాటిని కొనుగోలు చేయడం ద్వారా తీవ్రవాద సంస్థలకు పరోక్షంగా ఆర్థిక సహాయం అందుతున్నట్లు పేర్కొన్నారు.దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌ను కొనకూడదని, ముట్టుకోకూడదని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కల్పించేందుకే ప్రతి పాఠశాల,కళాశాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.గతంలో మెట్రో నగరాలకే పరిమితమైన డ్రగ్స్ సంస్కృతి ప్రస్తుతం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేశారు.జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని,గంజాయి సాగు పూర్తిగా అరికట్టామని తెలిపారు.ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా గంజాయి సరఫరా అవుతున్న నేపథ్యంలో నిఘా పెంచినట్లు చెప్పారు. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాల్లో పాల్గొన్న వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకు జిల్లాలో 20 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు.ముఖ్యంగా కళాశాల విద్యార్థులు డ్రగ్స్‌కు ఆకర్షితులయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఒక్కసారి అలవాటు అయితే దానికి బానిసలై బయటపడటం చాలా కష్టమని హెచ్చరించారు.
ఎన్‌డీపీఎస్ చట్టం కింద డ్రగ్స్ కేసులు నమోదైతే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోతారని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమాన్ని ఎస్బీ డీఎస్పీ అలహరి శ్రీనివాసరావు, తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, టూ టౌన్ సీఐ రవీంద్రబాబు, రూరల్ ఎస్ఐ ఆనంద్, త్రీ టౌన్ ఎస్ఐ కరిముల్లాతో పాటు పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 73

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *