must blossom as flowers of education within the system.

must blossom as flowers of education within the system.
వ్యవస్థలో విద్యాకుసుమలుగా ఎదగాలి

రాష్ట్ర వార్త…నరవ(విశాఖ జిల్లా): విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివినప్పుడే విద్యను సులభంగా అర్థం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పెందుర్తి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వి. సతీష్‌కుమార్‌ అన్నారు. నరవ బెహరా విద్యాసంస్థల ఆడిటోరియంలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు, తల్లిదండ్రుల పరిచయ కార్యక్రమం గురువారం నిర్వహించారు. బెహరా కళాశాలల సెక్రెటరీ డా. బెహరా చైతన్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సతీష్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యవ్వన దశలోనే తమ ఆలోచనా ధోరణిని సరైన మార్గంలో మలచుకోవాలని సూచించారు. అధ్యాపకులు బోధించే అంశాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడంతో పాటు చెడు వ్యసనాలు, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలన్నారు. తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని గుర్తుంచుకుని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. చైతన్య మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు చూపించే మార్గంలో నడిచే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా చదువుతూ విద్యను ఆచరణలో పెట్టిన విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించడంతో పాటు వ్యవస్థలో విద్యాకుసుమాలుగా వికసిస్తారని అన్నారు. ఈ
కార్యక్రమంలో కళాశాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బాణాల తరుణ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ డా. శ్రీధర్‌ పట్నాయక్‌, గణేష్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 88

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *