
వృద్ధులు, అనాథలకు చేయూత
స్వర్గీయ అంబటి విజయరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదానం
సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవాలన్న ఆశయంతో జీవించిన విశ్రాంత నావల్ డాక్‌యార్డ్ ఉద్యోగి స్వర్గీయ అంబటి విజయరాజు సేవలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన కుటుంబ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. విజయరాజు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లాతో పాటు ఆయన జన్మస్థలమైన తెనాలిలో పలు ప్రాంతాల్లో అన్నవితరణ కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలిలోని శక్తి హోమ్, గాంధీ ఆశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులకు భోజన వసతిని కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. వృద్ధులు, అనాథలు, ఆదరణకు నోచుకోని వారికి ఆపన్నహస్తం అందించడం ద్వారా విజయరాజు ఆశయాలను కొనసాగిస్తున్నామని కుటుంబ సభ్యులు అంబటి శేషు, శ్యామ్ సాగర్, పుష్పలత తెలిపారు. స్వతహాగా బలహీన వర్గాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచే విజయరాజు తన ఉద్యోగ జీవితంలోనూ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని సహోద్యోగుల అభిమానం పొందారని వారు గుర్తుచేశారు. గురువారం ఆయన వర్ధంతి సందర్భంగా ఆశ్రమాల్లోని నిరాశ్రయులకు, వృద్దులకు అన్నవితరణ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుటుంభ సభ్యుల కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ఆయన చూపిన సేవా మార్గంలో విజయరాజు ఆశయాలకు అనుగుణంగా మా కుటుంబం భవిష్యత్తులోనూ సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఆయన జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల రూపంలో చిరస్థాయిగా నిలబెట్టడం ద్వారా సమాజానికి కొంతైనా మేలు చేయాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.
