YCP cadres given directives on local body electionsContesting everywhere is inevitableFormer MLA Annabathuni Sivakumar

స్ధానిక సంస్ధల ఎన్నికలపై వైసిపి శ్రేణులకు దిశానిర్ధేశం 
ప్రతి చోటా పోటీ అనివార్యం
మజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్
రాష్ట్రవార్త తెనాలి:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం శనివారం గంగానమ్మపేటలోని రాధా మాధవ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశానికి పార్టీ లోని క్రియా శీలక పదవులున్న నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వివిధ స్థాయిల్లో పార్టీ పదవులు పొందిన నాయకులు, ప్రతినిధులకు
గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. అనంతరం పార్టీ భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసం పొందలేదని, కనిపించని వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతను వైసిపి శ్రేణులు పార్టీకి అనుకూలంగా మార్చుకునే విషయంపై దిశా నిర్ధేశం చేశారు. ఈక్రమంలో నియోజక వర్గంలోని కూటమి ప్రధాన పార్టీలపై ఘాటైన విమర్శలు చేశారు.తెనాలి మున్సిపాలిటీలో టీడీపీ, జనసేనలకు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో కూడా స్పష్టత లేదని శివకుమార్ విమర్శించారు. జనసేన యుద్ధానికి సిద్ధమంటున్నప్పటికీ, ఆ పార్టీ టీడీపీతోనే యుద్ధం చేస్తోందంటూ శివకుమార్ ఎద్దేవ చేశారు. పట్టణంలో కూటమి ప్రధాన నేతల మధ్య సఖ్యత లేదని ఆరోపించారు జనసేనలో అంతర్గత విభేదాలను ప్రస్తావిస్తూ నాదెండ్ల మనోహర్‌ను ఉద్దేశించి కూడా శివకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. మనోహర్ విషయంలో పవన్ కల్యాణ్ జాగ్రత్తగాఉండాలని ఆపార్టీ నేతలే చెబుతారని, వెన్నుపోటు పొడిచే స్వభావం ఆయన రక్తంలోనే ఉందంటూ ఆరోపించారు. సింగిల్ గా ఎన్నికలకు సిధ్ధం అనే వైఎస్ జగన్మోహనరెడ్డిని విమర్శించే స్ధాయి కూటమి నాయకులకు లేదన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో విస్తృతంగా పనిచేయాలని, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలన్నారు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 88

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *