Nutritious food is essential for a healthy society.

ఆరోగ్యవంతమైన సమాజంకోసం పౌష్టికాహారం అవసరం
రాష్ట్రవార్త తెనాలి:
ఆరోగ్యవంతమైన సమాజనిర్మాణంకోసం, స్త్రీలు గర్భిణీ సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, ఆవిధంగా సామాజిక బాద్యతగా రోటరీ ఆంధ్రాప్యారీస్ తెనాలి సంస్ధ, అవగాన కార్యక్రమం ఏర్పాటు చేయడంతొపాటు పౌష్టికాహారం అందజేయడం ముదావహమని రోటరీ జిల్లా నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ అన్నారు.
వేమూరు నియోజక వర్గం, కొల్లూరు మండలం క్రాప గ్రమంలొ, సంస్ధ ప్రాజెక్ట్ డైరెక్టర్ కాసరనేని మోహన్ నివాసం వద్ద, శనివారం రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారీస్ తెనాలి అధ్యక్షులు డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలోమాతా శిశు సంక్షేమం, పోషకాహార,ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈసందర్బంగాఅంగన్వాడీ స్కూల్లో పిల్లలుకు వాటర్ బాటిల్స్,చాపలు అందజేశారు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషకాహర కిట్లు అందజేసారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీ లకు సీమంతం చేసి వారి ఆశీర్వదించారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్రా ప్యారిస్ తెనాలి అధ్యక్షులు డాక్టర్ కనగాల మదుసూధన ప్రసాద్ మాట్లాడుతు ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల ద్వారా తల్లి, బిడ్డలకు, గర్భిణీ స్త్రీలకు తగువిధమైన పోషకాహారం అందిస్తున్నా, రోటరీ క్లబ్ సామాజిక బాద్యతగా, మాత, శిశు సంక్షేమం దిశగా అవగాహన సదస్సుతొ పాటు, పౌష్టికాహారం అందజేయడం ఓ బాద్యతగా చేపట్టామన్నారు.

మరో అతిధి రోటరీ జిల్లా నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతు రోటరీ సామాజిక సేవలలో, పేదవర్గాల గర్భిణీ స్త్రీలకు తగు విధంగా పోషకాహారం అందించడం జరుగుతుందని, గ్రామంలో గర్భిణీలకు సీమంతం చేసి ఆశీర్వదించడం ముదావహమన్నారు.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ మైనేని రత్నప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ మున్నంగి శ్రీనివాస రావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాస్తి వినోద్ లక్ష్మి,క్లబ్ సభ్యులు మన్నే శ్రీనివాస రావు. చిట్టీనేని సత్యవరప్రసాద్ గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.




rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 88

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *