తహశీల్దార్ పనితీరు భేష్!

సిఎం చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న ఎమ్మార్వో

రాష్ట్రవార్త-విశాఖపట్నం: గోపాలపట్నం తహశీల్దార్ రమేష్ తన విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. 31వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) భాగస్వామ్య సదస్సు–2026ను విజయవంతంగా నిర్వహించడంలో భాగంగా ఆయన అందించిన సేవలకు ఈ గుర్తింపు లభించింది. సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, దేశ విదేశాల నుంచి విచ్చేసిన పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రతినిధులకు సంబంధించిన ప్రోటోకాల్ విధులను రమేష్ సమర్థవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన పనితీరును గుర్తించిన ప్రభుత్వం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా రమేష్ సంతోషం వ్యక్తం చేస్తూ, తనకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 97

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *