విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, వంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) 103వ జయంతి (మే 28) వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ గురువారం తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని తన తాతకు నివాళులర్పించారు. అలానే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
సినీ దిగ్గజం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సినీ ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆయన మనవడు, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా నివాళులు అర్పించారు.
ఇవాళ గురువారం (మే 28) ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో ఎన్టీఆర్ గార్డెన్‌కు చేరుకొని తారక్ తన తాతకు పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి వినమ్రంగా నమస్కరించారు. కాసేపు అక్కడే కూర్చొని తాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.



