ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం

ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం
రాష్ట్రవార్త తెనాలి:
వ్యాపార అభివృద్ధిలో, వివిధ సామాజిక సేవలలో స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం భారత దేశం లోనే ముందు వరుసలో ఉన్నదని, తెనాలి ప్రాంతీయ కార్యాలయ మేనేజర్ అమరా రామమోహనరావు పేర్కొన్నారు.
సోమవారం ఉదయం క్రొత్తపేటలోని క్యాపిటల్ భవన్ లొ,భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాన్ని స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అమరా రామ మోహనరావు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా
రామమోహనరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ 38 బ్యాంక్ శాఖలను తెనాలి ప్రాంతీయ కార్యాలయంలో ఉంటాయని, ఆయా శాఖల ద్వారా విలువైన బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులకు అందించటం జరుగుతుందని వివరించారు.
బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి వి జగదీశకుమార్ మాట్లాడుతూ తను ప్రాంతీయ అధికారిగా పనిచేసినప్పుడు నాణ్యమైన ఖాతాదారుల సేవలను అధికారులు, సిబ్బంది సహకారంతో సమర్థవంతంగా అందించానని, నూతనంగా వచ్చిన ప్రాంతీయ అధికారి రామకృష్ణకు కూడా అందిస్తారని ఆశిస్తున్నామన్నారు.
తెనాలి స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రామకృష్ణ ప్రసంగిస్తూ నూతనంగా ఏర్పడిన రీజనల్ ఆఫీస్ ను బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అమరా రామమోహన్ రావు ప్రారంభించటం సంతోషంగా ఉందని అందరి సహకారంతో రీజియన్ అభివృద్ధి కృషి చేయగలనని తెలిపారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కుందన్ జ్యోతి , డిప్యూటీ జనరల్ మేనేజర్ అశోక్ వినాయకరావు సోనూనె, చీఫ్ మేనేజర్ ప్రతీన్, అవినాష్, విజయ్ కుమార్, అన్ని తెనాలి శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
