ఇల వైకుంఠపురంలో…. సాధకుల యోగసాధన …

**యోగాంధ్రా దిశగా వెంకన్న సన్నిధిలో 21వరకు యోగ శిక్షణ
రాష్ట్రవార్త తెనాలి:
ప్రధాని నరేంద్రమోదీ చొరవతో మనదైన ప్రాచీన ఆరోగ్య సాధనకు అంతర్జాతీయ గుర్తింపు లభించి 12వ సంవత్సరం నేపధ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆలయ ప్రాంగణాలు వేదికగా కొనసాగిస్తున్న, యోగాంధ్రా సాధనలో భాగంగా, ఇల వైకుంఠపురంలో సాధకులు చేస్తున్నారు యోగ సాధన. శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వైకుంఠపురంలో శుక్రవారం 3వ, రోజుగా, శ్రీ వెంకటేశ్వరా యోగా సేవా కేంద్రం, తెనాలి శాఖ కన్వీనర్, గజానన యోగి ముద్దాబత్తుని రమణయ్య ఆధ్వర్యంలో యోగ సాధన శిక్షణా తరగతులు ప్రాధాన్యతను చాటుతున్నాయి. ఆలయ ఇఒ వి. అనుపమ, ఆలయ కార్యాలయ సిబ్బంది, అర్చక స్వాములు సైతం యోగా సాధనకు మేముసైతం అంటు సాధన చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 6గంటలకు ఆలయానికి చేరుకునే సాధకులు, 7గంటల 30నిమిషాల వరకు సాధన చేస్తున్నారు. ఈక్రమంలో యోగ సాధకులు ఆలయానికి సైకిల్ పై వచ్చినా పార్కింగ్ ఫీజు లేదు. పాదరక్షలు భద్రపరచేచోట కూడా ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా రాయితీ ఇస్తున్నట్లు ఇఒ వి. అనుపమ తెలిపారు. యోగ కన్వీనర్ ఎమ్. రమణయ్య మాట్లాడుతు నిద్ర లేవగానే, ప్రాణాయామం, ద్యానం, యోగ సాధన చేయడం అలవర్చుకోవడం ద్వారా శరీరం మనం చెప్పినట్లు వింటుందన్నారు. మానశిక ప్రశాంతతొ, వత్తిడి లేని జీవితం గడిపే అవకాశం ఉంటుందని, ప్రతి కుటుంబంలో మహిళలు యోగ సాధకులు కావడం ద్వారా, ఆకుటుంబంలో అందరికి యోగ సాధన దినచర్యకానుందని అన్నారు. ఆరోగ్య భాగ్యం చేరువ చేసేయోగ సాధన తమ సంస్ధ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లుగా రమణయ్య వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం యోగాంద్రా నినాదంతొ ఆలయాల్లో యోగ సాధనకు శిక్షణ ఇవ్వడం ఆహ్వానించ దగ్గ అంశం అన్నారు.

